Sindhu:బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో సింధు 15వ స్థానం 1 y ago
భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానంలో నిలిచింది. మంగళవారం వెలువడిన జాబితాలో ఆమె రెండు స్థానాలు కోల్పోయింది. గాయం కారణంగా ఇటీవల ఆసియా మిక్స్డ్ టీమ్ ఛాంపియన్ షిప్ సింధు వైదొలగడంతో ర్యాంకింగ్‌పై ప్రభావం చూపించింది. మరోవైపు మాల్విక బాన్సోద్ మూడు స్థానాలు మెరుగై 28వ ర్యాంకులో నిలిచింది. పురుషుల సింగిల్స్ లక్ష్యసేన్ ఉత్తమంగా పదో స్థానంలో నిలవగా.. ప్రణయ్ 31వ ర్యాంకులో ఉన్నాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగెశెట్టి జంట ఏడో స్థానాన్ని నిలబెట్టుకుంది.